Hyderabad, జనవరి 29 -- బ్రేక్ ఫాస్ట్ లో కార్న్‌ఫ్లేక్స్ తినేవారి సంఖ్య అధికంగానే ఉంది. దీన్ని వండాల్సిన అవసరం లేకపోవడం, కేవలం పాలు వేసుకుని కలిపి తినేస్తే సరిపోతుంది. దీని వల్లే ఎక్కువ ఈ బ్రేక్ ఫాస్ట్ తినేందుకు ఇష్టం చూపిస్తున్నారు. ప్రతిరోజూ వీటినే అల్పాహారంగా తినేవారి సంఖ్య తక్కువేమీ కాదు. వీటిని తినడం ఆరోగ్యకరమేనా?

కార్న్ ఫ్లేక్స్‌లో ఎన్న రకాలు ఉన్నాయి. స్ట్రాబెర్రీలు, మిక్స్ డ్ ఫ్రూట్, బాదం, ఆర్గానిక్ తేనె వంటి రకాల్లో ఇవి దొరకుతున్నాయి. వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అందుకే వాటిని ఎక్కువమంది తింటున్నారు. కానీ వాటిలో చక్కెర, ఉప్పు (సోడియం) అధికంగా ఉంటాయని మాత్రం గుర్తించలేరు.

కార్న్ ఫ్లేక్స్ లో పోషకాలు తక్కువగా ఉండి పీచుపదార్థం తక్కువగా ఉంటుంది. ఇది గుండెకు, సాధారణ ఆరోగ్యానికి కూడా హానికరం. బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ ప్రకారం ఉదయం అల్...