భారతదేశం, ఏప్రిల్ 27 -- మలబద్ధకం అనేది వేసవిలో చాలా మంది బాధపడే సాధారణ సమస్య. ఒక వ్యక్తి వివిధ కారణాల వల్ల మలబద్ధకం కావచ్చు. వాటిలో అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ తినడం, ఫైబర్ లేని ఆహారాలు తినడం, తగినంత నీరు తాగకపోవడం, అధిక ఒత్తిడికి గురికావడం, వ్యాయామం చేయకపోవడం వంటివి ఉంటాయి. మలబద్ధకం సమస్య వస్తే.. జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే సరైన ఆహారం తీసుకోవాలి.

ఒక వ్యక్తి ముఖ్యంగా వేసవిలో మలబద్ధకంతో బాధపడుతుంటే దీనికి ప్రధాన కారణం శరీరంలో నీరు లేకపోవడమే. ఎక్కువ నీరు త్రాగాలి. ఇది కాకుండా కొన్ని పానీయాలు కూడా మలబద్ధకం సమస్య నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. వేసవిలో మీరు ఎదుర్కొనే మలబద్ధకం సమస్య నుండి తక్షణ ఉపశమనం కలిగించే కొన్ని సహజ పానీయాలను ఇప్పుడు చూద్దాం. ఈ పానీయాలను రోజూ తాగడం వల్ల మలబద్దకాన్ని నివారిం...