Hyderabad, మార్చి 4 -- ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయాన్నే పొట్టను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. పొట్ట శుభ్రం కాకపోతే చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. పొట్ట సరిగ్గా సులభంగా శుభ్రం అవకపోతే మలం గట్టిపడిందని అర్థం. దీన్నే మలబద్ధకం అంటారు. ఇది సాధారణ సమస్యే అయినప్పటికీ, దీర్ఘకాలంగా ఇలాగే జరగడం శరీరానికి హానికరం.

ఈమధ్య కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారు. పెద్దల మాట అటు ఉంచితే పిల్లల్లో మలవిసర్జన సరిగ్గా జరగకపోతే వారికి పొట్టలో నొప్పి వస్తుంది. ఆహారం సరిగ్గా తీసుకోలేరు. తరచూ ఏడ్చి ఇబ్బంది పెడుతుంటారు. మలబద్ధకం వల్ల పొట్ట శుభ్రం కాకపోవడంతో పాటు గ్యాస్, అసిడిటీ వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. చిన్నారులను మరింత ఇబ్బంది పెడుతుంది.

మలం సులభంగా బయటకు రావాలంటే తినే ఆహారంలో ఫైబర్ కచ్చితంగా...