భారతదేశం, మార్చి 14 -- Constable Movie: ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్‌కు దూర‌మ‌య్యే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు వ‌రుణ్ సందేశ్‌. గ‌త కొన్నాళ్లుగా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో కూడిన సినిమాలు చేస్తోన్నాడు. ప్ర‌స్తుతం కానిస్టేబుల్ పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ఆర్య‌న్ సుభాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌ధులిక హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ సినిమాలోని మేఘం కురిసింది...ప్రేమ మురిసింది అనే పాట‌ను మాజీ మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఈ పాట‌ను ర‌మ్య బెహ‌రా ఆల‌పించింది. రామారావు సాహిత్యం అందించారు. సుభాష్ ఆనంద్ మ్యూజిక్ అందించాడు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర ప్రధానమైనదని అన్నారు. విధి నిర్వహణలో పోలీసుల...