తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 21 -- పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలను ఏపీ యథేచ్చగా తరలించుకపోతుంటే ఆపడం చేతగాక. బీఆర్ఎస్ మీద రంకెలేయడమేంటని ప్రశ్నించారు.

టీడీపీ, కాంగ్రెస్ పాలమూరుకు తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి. ఇదిచరిత్ర చెపుతున్న సత్యం. పాలమూరును దత్తత తీసుకున్న అని చెబుతూనే పడావు పెట్టిండు నీ గురువు చంద్రబాబు. పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చి. పాలమూరు ప్రజల బతుకుల్లో నిప్పులు పోసింది కాంగ్రెస్. పాలమూరును ఎండబెట్టిన పాపం కాంగ్రెస్, టీడీపీలదే. ఆ 2 పార్టీల్లో ఉన్న రేవంత్ రెడ్డికి ఆ రెండు పాపాల్లో వాటా ఉంది. నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మార...