భారతదేశం, ఏప్రిల్ 13 -- బండి సంజయ్‌పై టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ఫైరయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులపై చర్చకు సిద్ధమా సంజయ్ అని సవాల్ విసిరారు. సన్నబియ్యం పంపిణీని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వాలని మోదీకి లేఖ రాసే దమ్ముందా అని ప్రశ్నించారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ల చట్ట బద్ధత కోసం మోదీని అడిగే ధైర్యం ఉందా.. అని నిలదీశారు.

'దేశ వ్యాప్తంగా జనగణన తోపాటు.. కుల గణన చేపట్టాలని మోదీకి లేఖ రాయగలవా? కేంద్రమంత్రులు సంజయ్, కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి సహకరించాల్సింది పోయి.. అడుగడుగునా అడ్డుపడడం సిగ్గుచేటు. అభివృద్ధి, సంక్షేమం.. రెండు కళ్ల సిద్ధాంతంతో పనిచేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదు. మా సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు' అని మహేశ్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు.

'బీఆర్ఎస్‌తో బీజేపీ అ...