భారతదేశం, ఏప్రిల్ 10 -- కొన్నేళ్లుగా భారత కాంపౌండ్ ఆర్చరీ టార్చ్ బేరర్ గా సాగుతున్న తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఒలింపిక్స్ డ్రీమ్ నిజం కాబోతోంది. ఇన్ని రోజులూ ఒలింపిక్స్ ఆడాలనే టార్గెట్ తో సాగుతున్న ఈ విజయవాడ ఆర్చర్ కు ఆ దిశగా అడుగులు వేసే ఛాన్స్ వచ్చింది. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్ లో కాంపౌండ్ ఆర్చరీ మిక్స్‌డ్‌ టీమ్ఈవెంట్ చేర్చడమే ఇందుకు కారణం. కాంపౌండ్ ఆర్చరీలో పోటీపడే సురేఖ.. ఇన్ని రోజులూ ఒలింపిక్స్ లో ఈ విభాగం లేకపోవడంతో నిరాశ చెందేది.

2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో కంపౌండ్ ఆర్చరీ (మిక్స్‌డ్‌ టీమ్) చేరుస్తున్నట్లు బుధవారం (ఏప్రిల్ 9) ప్రకటించడం భారత ఆర్చర్లకు గుడ్ న్యూస్ లాంటిదే. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఈవెంట్స్ లిస్ట్ ను ఆమోదించింది. అథ్లెటిక్స్ (4x100 మీటర్లు రిలే), గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, రోయ...