భారతదేశం, ఏప్రిల్ 12 -- Comedy Thriller OTT: మార్కో ఫేమ్ ఉన్ని ముకుంద‌న్ హీరోగా న‌టించిన గెట్ సెట్ బేబీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ మ‌నోర‌మా మ్యాక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నెలాఖ‌రు నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం.

గెట్ సెట్ బేబీ మూవీలో నిఖిలా విమ‌ల్ హీరోయిన్‌గా న‌టించింది. చెంబ‌న్ వినోద్ జోస్‌, శ్యామ్ మోహ‌న్‌, సుర‌భి ల‌క్ష్మి కీల‌క పాత్ర‌లు పోషించారు. మార్కో బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఉన్ని ముకుంద‌న్ హీరోగా న‌టించిన ఈ మూవీపై మ‌ల‌యాళంలో భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది.. బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్ హిట్‌గా నిలిచింది.

గెట్ సెట్ బేబీ మూవీకి విన‌య్ గోవింద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. లిమిటెడ్ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ బాక్సా...