భారతదేశం, మార్చి 25 -- Comedy OTT: సందీప్‌కిష‌న్‌, రీతూ వ‌ర్మ హీరోహీరోయిన్లుగా న‌టించిన మ‌జాకా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియ‌ల్‌గా క‌న్ఫామ్ అయ్యింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ మార్చి 28న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. మ‌జాకా ఓటీటీ రిలీజ్ డేట్‌ను వెల్ల‌డించిన జీ5 ఓటీటీ ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది.

మ‌జాకా మూవీలో రావుర‌మేష్, అన్షు (మ‌న్మ‌థుడు ఫేమ్‌) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ క‌థ‌ను అందించాడు. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి 26న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ తొమ్మిది కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. లాజిక్‌ల‌తో సంబంధం లేకుండా కామెడీని న‌మ్ముకొని తెర‌కెక్కించిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్ప...