Hyderabad, ఏప్రిల్ 3 -- Comedy Drama Web Series: పంచాయత్.. ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ లలో ఒకటి. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ కూడా సిద్ధమైంది. ఈ స్ట్రీమింగ్ తేదీని కూడా గురువారం (ఏప్రిల్ 3) ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది.

పంచాయత్ తొలి సీజన్ వచ్చి ఐదేళ్లయిన సందర్భంగా ఈ వెబ్ సిరీస్ మేకర్స్ ఓ ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో నాలుగో సీజన్ స్ట్రీమింగ్ తేదీని వెల్లడించారు. ఈ ఏడాది జులై 2 నుంచి ప్రైమ్ వీడియోలో పంచాయత్ నాలుగో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లయిన భూపేంద్ర జోగి, దర్శన్ మగ్దూమ్, ఇతరులతో కలిసి ఓ ఫన్నీ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇందులో పంచాయత్ వెబ్ సిరీస్ లీడ్ జితేంద్ర కుమార్ కూడా ఉన్నాడు. ఈ వీడియోలో తమ వీడియోలు వైరల్ కావడ...