భారతదేశం, మార్చి 29 -- Comedy Drama OTT: తెలుగు కామెడీ డ్రామా మూవీ నీ దారే నీ క‌థ థియేట‌ర్ల‌లో రిలీజైన తొమ్మిది నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. మ్యూజిక‌ల్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాలో ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. సీనియ‌ర్ హీరో సురేష్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. వంశీ జొన్నలగడ్డ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

గ‌త ఏడాది జూన్‌లో నీ దారే నీ క‌థ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఐఎమ్‌డీబీలో ఈ తెలుగు సినిమా 8.8 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. మిష‌న్‌ ఇంపాజిబుల్, పారసైట్ వంటి సినిమాల‌తో పాటు, స్క్విడ్ గేమ్ వెబ్‌సిరీస్‌కు బీజీఎమ్ అందించిన అలెగ్జాండర్ మ్యూజిక్, బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా నీ దారే నీ క‌థ సినిమాకు మ్యూజిక్ అందించాయి....