భారతదేశం, ఫిబ్రవరి 1 -- Comedy Drama OTT: క‌న్న‌డంలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన కామెడీ డ్రామా మూవీ కౌస‌ల్య సుప్ర‌జ రామ‌ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఫిబ్ర‌వ‌రి 27 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. సేమ్ టైటిల్‌తో ఈ మూవీ తెలుగులో విడుద‌ల అవుతోంది.

కౌస‌ల్య సుప్ర‌జ రామ‌ మూవీలో డార్లింగ్ కృష్ణ‌, బృంద ఆచార్య‌, మిలానా నాగ‌రాజ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. 2023లో క‌న్న‌డంలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ 15 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఆ ఏడాది క‌న్న‌డంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన నాలుగో మూవీగా నిలిచింది. నిర్మాత‌ల‌కు ప‌ది కోట్ల‌కుపైగా లాభాల‌ను తెచ్చిపెట్టింది. శ‌శాంక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు.

డార్లింగ్ కృష్ణ‌, మిలానా నాగ‌రాజ్ క‌ల‌యిక‌లో వ‌చ్...