HYderabad, మార్చి 9 -- రోజువారీ అలవాటులో భాగంగా కచ్చితంగా కాఫీ తాగే వాళ్లు చాలా మంది ఉంటారు. మనస్సు ఉల్లాసంగా అనిపించి రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుందని భావిస్తారు. ఇందులో ఉండే కెఫైన్ కారణంగా అటువంటి ఫీలింగ్ కలగడం సహజమే. కానీ, ఇది తాగడం వల్ల మరో ప్రమాదం కూడా ఉందట. కాఫీ తాగే వారు దాంతో పాటు సప్లిమెంట్లు (విటమిన్ ట్యాబ్లెట్స్) తీసుకునే వారికి ఇది కాస్త ఇబ్బందికరంగా అనిపించే విషయమే కావొచ్చు. ఎందుకంటే, కాఫీతో పాటు విటమిన్ ట్యాబ్లెట్లు శరీరంలోకి చేరితే విటమిన్ డీ, ఐరన్, కాల్షియం వంటి వాటిని శరీరం గ్రహించడంలో నెగెటివ్ ఎఫెక్ట్స్ చూపించొచ్చట. శరీరానికి చేసే మేలు కంటే ప్రమాదాలే ఎక్కువగా ఉంటాయట. ఆందోళన, సరిగా నిద్ర పట్టకపోవడం, ఎక్కువ రక్తపోటు, నీరసం వంటి సమస్యలు కలుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

అదెలా అంటే, కాఫీలో ఉండే గుణం విటమిన్ D శోషణను అడ్డుకుంటు...