Hyderabad, జనవరి 27 -- కాఫీతోనే మీ రోజును మొదలుపెడతారా? అయితే మీరు కొన్ని అంశాల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వేడి వేడి కాఫీ గొంతులోకి దిగుతూ ఉంటే ఆ కిక్కే వేరు. ఒక గ్లాస్ కప్పులో లేదా స్టీల్ కప్పులో వేడి కాఫీ తాగుతుంటే ఎలాంటి సమస్య ఉండదు. అయితే కొందరు పేపర్ కప్పులో కాఫీ లేదా టీ తాగుతూ ఉంటారు. ప్లాస్టిక్ కప్పులతో పోలిస్తే స్టీల్, గాజు గ్లాసులో తాగడం పర్యావరణానికి, ఆరోగ్యానికి మంచిది. పేపర్ కప్పుల్లో లేదా ప్లాస్టిక్ కప్పుల్లో కాఫీ తాగడం వల్ల శరీరంలో మైక్రో ప్లాస్టిక్ చేరే అవకాశం ఉంది. పరిశోధనల ప్రకారం ఒక వేడి ద్రవాన్ని లేదా ఆహారాన్ని పేపర్ కప్పులో పావుగంట పాటు వేయడం వల్ల 1,000 కంటే ఎక్కువ చిన్న ప్లాస్టిక్ కణాలు ఆ ఆహారంలో చేరుతాయి. ఒక పేపర్ కప్పులో 3 కప్పుల కాఫీ తాగడం 75,000 మైక్రోప్లాస్టిక్ కణాలే శరీరంలో చేరే అవకాశం ఉంది.

ప్లాస్టిక...