భారతదేశం, ఫిబ్రవరి 22 -- భారతదేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుదలతో చాలా మంది ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్ల వైపు చూస్తున్నారు. అయితే మీరు కూడా సీఎన్జీ కారు కొనే ఆలోచనలో ఉంటే.. మీ కోసం అనేక ఆప్షన్స్ మార్కెట్‌లో ఉన్నాయి. దాదాపు రూ. 10 లక్షలలోపు ధరలో సీఎన్జీ కార్లు దొరుకుతాయి. వీటిలో కొన్నింటి గురించి చూద్దాం..

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కావాలనుకుంటే అప్డేట్ చేసిన స్విఫ్ట్ సీఎన్జీ మోడల్‌ను చూడవచ్చు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 6.49 లక్షలు. అదే సమయంలో దాని సీఎన్జీ శ్రేణి రూ. 8.19 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ సీఎన్జీ వేరియంట్‌లో 69.75బీహెచ్‌పీ, 101.8ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి ప్రకారం స్విఫ్ట్ సీఎన్జీ కిలోగ్రాముకు 32.85 కిలోమీటర్ల మైలేజీని...