భారతదేశం, జనవరి 2 -- మేడ్చల్ జిల్లాలోని సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బాలికల హాస్టల్‌లో.. వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు సంచలనంగా మారాయి. ఈ ఘటనను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఛైర్‌పర్సన్ శారద సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ ఘటనపై వేగంగా దర్యాప్తు చేయాలని కోరారు. వీలైనంత త్వరగా కమిషన్‌కు నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.

గత మూడు నెలల్లో దాదాపు 300 ప్రైవేట్ వీడియోలు రహస్యంగా రికార్డ్ చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాలను అమర్చినందుకు బాధ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ సభ్యులతో కలిసి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఇష్యూలో హాస్టల్ సిబ్బంది ప్రమేయం ఉండవచ్చని విద్యార్థులు అనుమానిస్తున్నారు. కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని తొక్కేయడానికి ప్రయత్నించిందని, బయటకు చెబిత...