భారతదేశం, మార్చి 1 -- CM Revanth Reddy : ఇసుక‌తో పాటు ఇత‌ర ఖ‌నిజాల అక్రమ త‌వ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. క‌ఠిన చ‌ర్యల‌తోనే అక్రమాల‌ను అడ్డుకోగ‌ల‌మ‌ని, ప్రభుత్వానికి ఆదాయం పెంచ‌గ‌ల‌మ‌ని అభిప్రాయపడ్డారు. గ‌నుల శాఖ‌పై ఐసీసీసీలో సీఎం రేవంత్ రెడ్డి శ‌నివారం స‌మీక్ష నిర్వహించారు. తొలుత గ‌త నెల రోజులుగా తీసుకున్న చ‌ర్యల‌తో ఇసుక అక్రమ ర‌వాణాకు అడ్డుక‌ట్ట ప‌డిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఇసుక రీచ్‌ల్లో త‌వ్వకాలు, ర‌వాణా, వినియోగ‌దారుల‌కు త‌క్కువ ధ‌ర‌కు ఇసుక స‌ర‌ఫ‌రాపై అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి ప‌లు సూచ‌న‌లు చేశారు. ప్రభుత్వంలోని నీటి పారుద‌ల‌, ఆర్ అండ్ బి, పంచాయ‌తీరాజ్‌తో పాటు వివిధ శాఖ‌ల ఆధ్వర్యంలో చేపట్టే ప‌నుల‌కు టీజీఎండీసీ నుం...