భారతదేశం, ఫిబ్రవరి 24 -- CM Revanth Reddy : కరీంనగర్ గడ్డ నుంచే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఆనాడు సోనియా గాంధీ మాట ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారన్నారు. పీవీ నరసింహరావు లాంటి ఎంతోమందిని అందించిన ఘనత కరీంనగర్ గడ్డకు ఉందన్నారు. ఈ గడ్డ రాజకీయ చైతన్యానికి మారుపేరు అన్నారు.

"కరీంనగర్ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత జీవన్ రెడ్డిది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని బీఆరెస్ నేతలు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పిలుపునిస్తున్నారు. ఎవరైనా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఇతర పార్టీ అభ్యర్థులను ఓడించాలని ప్రచారం చేస్తారు. కానీ ఏ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్ ను ...