భారతదేశం, ఫిబ్రవరి 4 -- CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కులగణన సర్వే-2025 నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు కేబినెట్ సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సరైన సమాచారం లేదన్నారు. దీంతో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు నెలకొన్నారని చెప్పారు. 1931 తరువాత భారతదేశంలో ఇప్పటి వరకు బలహీన వర్గాల సంఖ్య ఎంతో లెక్కించలేదని అన్నారు.

"జనాభా లెక్కల్లోనూ బలహీనవర్గాల లెక్కలు పొందుపరచలేదు. అందుకే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణలో కులగణన చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశాం....