భారతదేశం, ఫిబ్రవరి 14 -- CM Revanth Reddy : రాష్ట్రానికి ఆదాయం స‌మ‌కూర్చడంతో పాటు యువ‌త‌కు ఉపాధి క‌ల్పించే వ‌న‌రుగా ప‌ర్యాట‌క శాఖ ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఘనమైన తెలంగాణ చ‌రిత్రను వ‌ర్తమానానికి అనుసంధానిస్తూ, భ‌విష్యత్‌కు బాట‌లు వేసేలా ప‌ర్యాట‌క శాఖ‌ను తీర్చిదిద్దాలని సూచించారు. శుక్రవారం పర్యాటక శాఖ కార్యాచరణపై సీఎం ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించే వ‌న‌రులు తెలంగాణలో ఉన్నప్పటికీ గ‌తంలో సరైన ప్రణాళికలు అమలు చేయలేదన్నారు. ఈ కారణంగా ఆ రంగంలో ఆశించిన ప్రగతి కనిపించలేదని చెప్పారు.

ప‌ర్యాట‌క శాఖ పాల‌సీకి తుది రూపు ఇచ్చే స‌మ‌యంలో అట‌వీ, ఐటీ, విద్యుత్‌, టీజీ ఐఐసీ, వైద్య, క్రీడ‌ల శాఖ‌ల‌తో స‌మ‌న్వయం చేసుకోవాల‌ని, ఒక శాఖ విధానాలు మ‌రో శాఖ విధానాలకు ఆటంకంగా ఉండ‌కుండా జాగ్రత్తలు తీసుకోవాల‌న...