భారతదేశం, ఏప్రిల్ 9 -- CM Revanth Reddy : అహ్మదాబాద్ సీడ‌బ్ల్యూసీ విస్తృతస్థాయి స‌మావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... మ‌హ‌త్మా గాంధీ, స‌ర్దార్ వ‌ల్లభాయ్ ప‌టేల్‌ల గ‌డ్డపైన, స‌బ‌ర్మతీ న‌ది ఒడ్డున రెండు రోజులుగా మ‌నం మేధో మ‌ద‌న (చింత‌న్ బైఠ‌క్‌) స‌ద‌స్సు జ‌రుపుకుంటున్నామన్నారు. అధికారం చేప‌ట్టిన త‌ర్వాత దేశంలో మోదీ చేస్తున్న విభ‌జ‌న రాజ‌కీయాల‌కు వ్యతిరేకంగా ప్రజ‌ల‌ను ఏకం చేసేందుకు స‌బ‌ర్మతీ ఒడ్డున స‌మావేశ‌మ‌య్యామన్నారు. గాంధీజీ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రయత్నిస్తున్నామన్నారు. గాడ్సే ఆలోచ‌న విధానాన్ని దేశంలో వ్యాపింప‌జేసేందుకు ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్రయ‌త్నిస్తున్నారని మండిపడ్డారు.

"గాడ్సే వార‌సుల ఆలోచ‌న ధోర‌ణిని అడ్...