Hyderabad,telangana, ఏప్రిల్ 10 -- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రతీ పోలీస్ సిబ్బందికి అత్యంత ముఖ్యమైనదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గురువారం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగానే ఏర్పాటు చేసి ప్రారంభించామని చెప్పారు.

ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో దేశంలో యూనివర్సిటీల పునాదులు పడ్డాయని సీఎం రేవంత్ గుర్తు చేశారు. "నెహ్రూ దార్శనికతతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరింది. దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారు.. కానీ అందులో కొద్ది మంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారు. ఆ కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పా...