భారతదేశం, ఫిబ్రవరి 10 -- CM Revanth Reddy : ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, రీచ్‌ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించార...