భారతదేశం, ఫిబ్రవరి 21 -- CM Revanth Reddy : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి...పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అప్పకపల్లిలో బీపీసీఎల్ సహకారంతో ఏర్పాటు చేసిన మహిళా సమాఖ్య పెట్రోల్‌ బంక్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

అనంతరం మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ...రాష్ట్రంలో మహిళా సమాఖ్యల్లో మొత్తం 67లక్షల మంది ఉన్నారన్నారు. మహిళా సమాఖ్య సభ్యులకు రూ. 1000 కోట్ల ఖర్చుతో ఏడాదికి రెండు మంచి చీరలు అందిస్తామన్నారు. శిల్పారామం వద్ద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు.

"రాష్ట్రంలో 1000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంటును మహిళలు నిర్వహించబోతున్నారు. ప్రతి...