భారతదేశం, ఫిబ్రవరి 25 -- CM Revanth Reddy: కేసీఆర్‌ కుటుంబం కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టలేదని విమర్శించారు. వారి కుట్రలను తిప్పి కొట్టేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలిపించి బిజెపిని బొంద పెట్టి తెలంగాణకు రావాల్సిన నిధులు సాధించుకోవాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప సభకు సీఎం రేవంత్ రెడ్డి తోపాటు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సీతక్క ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ క...