తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 26 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు ప్రాజెక్టులకు కేంద్రం సాయాన్ని కోరారు. ఈ సందర్భంగా.. విభజన చట్టంలోని పెండింగ్‌ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపుల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన ట్లు తెలిసింది.

రాష్ట్రానికి అన్నివిధాలుగా చేయూత అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక SLBC టన్నెల్‌ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీతో చర్చించారు. ప్రమాదానికి గల కారణాలు, చేపట్టిన సహాయక చర్యలను వివరించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, డిజీపీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు గంటకుపైగా సాగిన ఈ సమావేశంలో. రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై చర్చించారు. మూసీ నది సుంద...