భారతదేశం, నవంబర్ 29 -- 2022 జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రూ. 694 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌ నవంబర్ 30న బటన్ నొక్కి.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు. మదనపల్లెలో నిర్వహించే.. కార్యక్రమంలో పాల్గొని నిధులను జమ చేస్తారు. పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ప్రభుత్వం ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపులు చేస్తోంది.

జులై-సెప్టెంబర్‌ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లను సీఎం జగన్‌ 30వ తేదీన అంటే బుధవారం మదనపల్లెలో బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. 2017 సంవత్సరం నుండి పెట్టిన బకాయిలు.., రూ. 1,778 కోట్లతో కలిపి ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 12,...