భారతదేశం, నవంబర్ 28 -- తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌(CM Jagan) బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేశారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ(Input Subsidy), వైఎస్సార్‌ సున్నా వడ్డీ(YSR Sunna Vaddi) పంట రుణాలను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. 62 శాతం జనాభా వ్యవసాయ రంగంపైనే.. ఆధారపడ్డారని సీఎం జగన్(CM Jagan) అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటేనే.. ఏ రాష్ట్రమైనా బాగుంటుందన్నారు. మూడేళ్ల 5 నెలల కాలంలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామన్నారు. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే.. అదే సీజన్లో ఇస్తున్నామన్నారు.

'రూ.200 కోట్లు రైతుల ఖాతాల్లోకి(Farmers Account) జమ చేస్తున్నాం. 21.31 లక్షలమందికి రూ.1,834 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ(Input Subsidy) ఇచ్చాం. 8 లక్షల 22 వేల 411 మంది రైతులకు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్ము చెల్లిస్తున్నాం. ఏడాదిలో...