భారతదేశం, ఫిబ్రవరి 24 -- CM Election Campaign: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి మూడు జిల్లాల్లో పర్యటిస్తారు. సీఎం తోపాటు పిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ పలువురు మంత్రులు హాజరై ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల లో పట్టభద్రులతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొనబోతున్నారు. రేపటితో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఆఖరి మోకాగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి పార్టీ నేతల సహకారం సన్నగిల్లిందనే ప్రచారం జోరు అందుకుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొంటున్నారు....