భారతదేశం, ఏప్రిల్ 6 -- CM Chandrababu Letter : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల సుంకాల బాంబ్ పేల్చారు. భారత్ సహా చాలా దేశాల ఎగుమతులపై భారీగా సుంకాలు విధించారు. దీంతో ముఖ్యంగా ఏపీ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా సుంకాలతో నష్టపోతున్న ఏపీ ఆక్వారంగాన్ని ఆదుకోవాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు.

అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా యూఎస్‌ ప్రభుత్వంతో చర్చలు జరపాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు. ఏపీ జీడీపీలో మత్స్యరంగానికి కీలక పాత్ర అని గుర్తుచేశారు. సంక్షోభ సమయంలో ఆక్వా రైతులకు అండగా ఉండాలని కేంద్రాన్ని కోరారు. భారత్‌పై అమెరికా 27శాతం సుంకం విధింపుతో ఆక్వారంగానికి తీవ్ర నష్టమని పేర్కొన్నారు. అధిక సుంకాల వల్ల భారత్ దేశ ఆర్డర్లను ఇత...