భారతదేశం, జనవరి 27 -- CM Chandrababu : సంక్షేమ పథకాలు అమలు చేయడానికి నిధుల్లేవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను పథకాల కోసం మళ్లించలేమన్నారు. డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించమని చెప్పారు. అప్పు చేసైనా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.

"మేము చెప్పిన ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రూ.4 వేలకు పెంచాం. 64 లక్షల మందికి, ఏడాదికి రూ.33 వేల కోట్లు ఇస్తున్నాం. దీపం పథకం కింద ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తున్నాం. అన్న క్యాంటీన్లతో, రూ.5 కే భోజనం పెడుతున్నాం. గత ప్రభుత్వం పెట్టి వెళ్లిన రూ.22 వేల కోట్ల బకాయిలు కట్టాం. గత ప్రభుత్వంలో అప్పులు తెచ్చి, అభివృద్ధి గురించి పూర్తిగా మర్చిపోయారని నీతి ఆయోగ్ రిపోర్ట్ బయట పెట్టింది. అప్పు తెచ్చి ఆదాయం పెంచే వాటి...