భారతదేశం, ఫిబ్రవరి 11 -- CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. స్టెమ్ కోర్సు మహిళలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. సైన్స్ రంగంలో విజయాలు సాధిస్తున్న మహిళలకు అభినందనలు చెప్పారు. స్టెమ్‌ కోర్సు రంగాల్లో వృద్ధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొవిడ్‌ తర్వాత పరిణామాలు, అందుబాటులో ఉన్న సాంకేతికత 'వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌' ప్రాముఖ్యతను పెంచాయని గుర్తు చేశారు.

రిమోట్‌ వర్క్‌, కోవర్కింగ్‌ స్పేస్‌, నైబర్‌హుడ్‌ వర్క్‌ స్పేస్‌ వంటి కాన్సెప్ట్‌లు అనువైన ఉత్పాదక వాతావరణాన్ని సృష్టిస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవి వ్యాపారులు, ఉద్యోగులకు సమర్థవంతమైన ఫలితాలు అందిస్తాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మెరుగైన పని, జీవిత సమతుల్యత...