భారతదేశం, ఫిబ్రవరి 25 -- CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా, రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రగా తీర్చిదిద్దడానికి పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో మాట్లాడుతూ...ఎన్టీఆర్ వైద్య సేవను హైబ్రిడ్ విధానం‌లోకి విస్తరిస్తామన్నారు. బీమా, పీఎంజేఏవై, ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు రూ.2.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీని, పేద కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందిస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం దిశగా ఒక చారిత్రాత్మక అడుగు వేస్తున్నామన్నారు. ఆరోగ్య బీమా పథకం ద్వారా రాష్ట్రంలో ఒక కోటి అరవై లక్షల కుటుంబాలకు పైగా లబ్ధి చేకూరనుందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజాహితం కోసం తీసుకు...