భారతదేశం, మార్చి 8 -- CM Chandrababu : ఏపీలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం నారా చంద్రబాబు శుభవార్త చెప్పారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..గతంలో అధిక సంతానం వద్దని తానే చెప్పానని, ప్రస్తుతం మారిన పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది పిల్లలను కనాలని చెప్తున్నానని అన్నారు. ఉత్తర భారతదేశంలో ఒక్కో జంట ముగ్గురు పిల్లలను కలిగి ఉంటారన్నారు. దక్షిణ భారతదేశంలో అలాంటి పరిస్థితి లేవన్నారు. ఇక్కడి ప్రజలు తక్కువన మంది సంతానాన్ని కలిగి ఉంటారన్నారు. కొందమంది ఏకంగా పిల్లలను కనడానికి కూడా ఇష్టపడటం లేదన్నారు.

పిల్లలను కనకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవన్న సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు...