భారతదేశం, మార్చి 12 -- CM Chandrababu : టీడీపీ...ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇస్తే... తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా వేధించిన వ్యక్తి గతంలో ఈ సభలో ఉన్నారని వైఎస్ జగన్ ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. ఏపీ అసెంబ్లీలో మహిళా సాధికారితపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. డీలిమిటేషన్ పూర్తయితే సుమారు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని చెప్పారు.

తొలిసారి విద్యా, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ అని గుర్తుచేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బాగా చదువుకున్నారని, ప్రస్తుతం మహిళలకే ఎదురుకట్నం ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. ఒక పబ్లిక్ పాలసీ ఎంత మార్పు తీసుకుని వస్తుందో, ఇది ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు అన్నారు.

ఓవై...