భారతదేశం, మార్చి 11 -- CM Chandrababu : వైసీపీ ప్రభుత్వంలో.. ప్రభుత్వ భూములు, అటవీ భూములు కొట్టేశారని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ఎవరైనా భూకబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదని, పకడ్బందీ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు.

"గత ఐదేళ్లు అసెంబ్లీలో బూతులు విన్నాం. సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోయారు. ఇప్పుడు అసెంబ్లీలో బూతులు లేవు... సమస్యలపైనే చర్చలు చేస్తున్నాం. ఆడబిడ్డలపై అత్యాచారం చేసి తప్పించుకోవాలని అనుకుంటే అదే చివరి రోజు అవుతుంది. రౌడీయిజం చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో రౌడీ అనే వాళ్లు ఉండటానికి వీల్లేదు. రౌడీయిజం చేయాలనుకుంటే రాష్ట్రం నుంచి పారిపోండి. రౌడీయిజం చేసి తప్పించుకుంటామంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాం. ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం. గంజాయి పండిం...