భారతదేశం, ఫిబ్రవరి 8 -- CM Chandrababu : 'ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం స్కాంతో పోల్చుకుంటే, దిల్లీలో జరిగిన స్కాం చాలా చిన్నది. మద్యం కుంభకోణంలో వచ్చే డబ్బు, పాపిష్టి డబ్బు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి, వేల కోట్లు దోచుకున్నారు' అని గత వైసీపీ పాలనపై సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.

'దిల్లీలో కేజ్రీవాల్ షీష్ మహల్, ఏపీలో రుషికొండ ప్యాలెస్.. ఇలాంటి విచ్చలవిడితనాన్ని ప్రజలు ఆమోదించరని చెప్పటానికి, మొన్న ఆంధ్రప్రదేశ్, ఇవాళ దిల్లీ ఎన్నికల ఫలితాలు ఒక ఉదాహరణ. రెండు చోట్లా వాళ్లు కట్టుకున్న ప్యాలెస్ లోకి ప్రజలు వెళ్లనివ్వకుండా తీర్పు ఇచ్చారు' అని చంద్రబాబు అన్నారు.

ప్రతిపక్ష హోదాపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. 'నీ స్థానాన్ని బట్టి నీకు హోదా ఇస్తారు. నాకు కావాల్సిన స్థానం ఇవ్వాలి, ప్రధానితో స...