భారతదేశం, మార్చి 8 -- CM Chandrababu : ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన సీఎం... మహిళలు తయారు చేసిన పలు ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అరటి చెట్ల వ్యర్థాలతో తయారు చేసిన టోపీని సీఎం చంద్రబాబు ధరించారు. గుర్రపుడెక్క, అరటి, కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీ ద్వారా ఆదాయం లభిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. దీనిపై దృష్టి పెట్టాలని మహిళలకు సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు నాణ్యత, బ్రాండింగ్‌ తీసుకురావాలన్నారు. అనంతరం ఈ-వ్యాపారి పోర్టల్‌ డెలివరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

అనంతరం పోలీసు శాఖ రూపొందించిన 'శక్తి యాప్‌'ను సీఎం ప్రారంభించారు. మహిళల చేనేత రథాన్ని ప్రారంభించడంతో పాటు మహిళా ర్యాపిడో డ్రైవర్లను అభినందించార...