భారతదేశం, మార్చి 26 -- CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు కలెక్టర్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాల అధికారులతో సంబంధం లేకుండా కొత్త జిల్లాలో జిల్లా అధికారులకు పూర్తిస్థాయిలో అధికారాలు అప్పగించాలని సీఎం ఆదేశించారు. జిల్లాలోని అధికారులు స్వేచ్ఛగా విధులను నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్నారు. ఈ ప్రక్రియపై హెచ్‌ఓడీలు రెండు రోజుల్లో ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. అదే విధంగా కొత్త జిల్లాల్లో ఎటువంటి సిబ్బంది సమస్య లేకుండా స్టాఫ్ రెగ్యులేషన్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

పని ఒత్తిడికి తగిన విధంగా అధికారులు, సిబ్బందిని కేటాయించాలని సూచించారు. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్లలో కనీసం మూడు హోటల్స్ ఉండేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల కల్పన అంశంపై కూడా అధికారులు ప్రత్య...