భారతదేశం, మార్చి 22 -- CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. భారతరత్న అంబేడ్కర్‌ను అగౌరవపరిచేలా విగ్రహం పట్ల దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఘటనపై డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి...కుట్రతో ఇటువంటి నేరాలకు పాల్పడతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు, ఆయా వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించేవారిపట్ల అత్యంత కఠిన వ్యవహరించి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేవారిపై నిఘా ఉంచాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Published by HT Digital Content S...