భారతదేశం, ఏప్రిల్ 14 -- CM Chandrababu : అంబేడ్కర్‌ విదేశీ విద్యా దీవెన పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో పర్యటించిన ఆయన... అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నవీన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. బైక్ మెకానిక్ ప్రవీణ్ షాపును పరిశీలించారు.

అనంతరం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేడ్కర్‌ పోరాడారని గుర్తుచేశారు. దళితులకు టీడీపీ ఎప్పుడూ అండగా నిలబడుతుందన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని లోక్‌సభ స్పీకర్‌గా చేసింది టీడీపీ అని గుర్తుచేశారు. సొంతూరిలోనే బంగారు భవిష్యత్తు ఉందని యువత భావిస్తున్నారన్నారు. సబ్ ప్లాన్ ద్వారా దళితు...