భారతదేశం, ఫిబ్రవరి 14 -- CID DSP Death: ఆలయం ముందు గుర్తు తెలియని మృతదేహంగా స్వాధీనం చేసుకున్న శవం సీఐడీ డిఎస్పీదిగా తేలడంతో కలకలం రేగింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం గుడి ముందు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆరా తీయడంతో అది కనిపించకుండా పోయిన సీఐడీ డిఎస్పీదిగా తేలింది.

రాజమహేంద్రవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రి గాంధీపురం పరిధిలోని ఎస్‌ఆర్‌ఎంటీ గోడౌన్‌ సమీపంలో ఉన్న సాయిబాబా గుడి దగ్గర మృతదేహం పడి ఉందని స్థానికుల నుంచి గురువారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది..

స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఫొటోను పోలీసు వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టారు. కాసేపట్...