భారతదేశం, ఫిబ్రవరి 10 -- CID Case On RGV :ఏపీ సీఐడీ విచారణకు దర్శకుడు రాంగోపాల్ వర్మ డుమ్మా కొట్టారు. సోమవారం విచారణకు హాజరవ్వాలని ఆర్జీవీకి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాను సినిమా ప్రమోషన్ లో ఉన్న కారణంగా సోమవారం విచారణకు రాలేనని ఆర్జీవీ సీఐడీకి సమాచారం అందించారు.

ఆర్జీవీ తరఫున ఆయన న్యాయవాది నానిబాబు గుంటూరు సీఐడీ కార్యాలయానికి వచ్చారు. ఎనిమిది వారాల పాటు ఆర్జీవీ ఎలాంటి విచారణకు హాజరుకాలేరని, ఎనిమిది వారాల పాటు గడువు ఇవ్వాలని లిఖిత పూర్వకంగా సీఐడీ పోలీసులకు వినతి పత్రం అందించారు.

ఈ నోటీసులపై సీఐడీ అధికారులు ఏవిధంగా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది. అయితే ఆర్జీవీకి మంగళవారం మళ్లీ నోటీసులు ఇవ్వాలని సీఐడీ భావిస్తున్నట్లు సమాచారం. 2019లో రాంగోపాల్ వర్మ 'కమ్మ ...