భారతదేశం, మే 3 -- How to improve Cibil score : లోన్​ తీసుకోవాలంటే సిబిల్​ స్కోర్​ చాలా ముఖ్యం. మంచి క్రెడిట్​/ సిబిల్​ స్కోర్​ ఉంటే.. తక్కువ వడ్డీకి లోన్​ పొందొచ్చు. మన మీద ఆర్థిక భారం తగ్గుతుంది. కానీ సిబిల్​ స్కోర్​ సరిగ్గా లేకపోతే.. లోన్​ దొరకడం కూడా కష్టమవుతుంది. అంతా బాగుంది కానీ.. అసలు ఇప్పటివరకు ఒక్క లోన్​ కూడా తీసుకోకపోతే.. సిబిల్​ స్కోర్​ ప్రభావితం అవుతుందా? అని అడిగితే.. కచ్చితంగా ఎఫెక్ట్​ పడుతుందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఆ వివరాలను ఇక్కడ చూద్దాము..

సిబిల్​ స్కోర్​ అనేది ఒక 3 డిజిట్​ నెంబర్​. మన క్రెడిట్​ హిస్టరీని సూచించే నెంబర్​ ఇది. సాధారణంగా.. 300-900 మధ్యలో ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటే.. మనం అంత బాగా లోన్​ని తీర్చుతున్నట్టు! ఈ విషయం అర్థం చేసుకుని.. బ్యాంక్​లు, ఆర్థిక సంస్థలు మనకి ఇంకా ఇంకా లోన్​లు ఇస్తుంటాయి.

కానీ.. మీర...