Hyderabad, జనవరి 30 -- నిశ్చల జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఈ కాలంలో గుండె జబ్బులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గుండె జబ్బులను తెచ్చి పెడుతున్న సమస్యల్లో ఒకటి చెడు కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదం పెరిగిపోతుంది. ఎప్పుడు ఎవరు గుండె జబ్బుల బారిన పడతారో ఇప్పుడు చెప్పడం కూడా కష్టమైపోయింది.

చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం. మీకు కూడా చెడు కొలెస్ట్రాల్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చిన అయిదు రకాల చట్నీలను మీ డైట్ లో చేర్చుకోండి. ఈ చట్నీలన్నీ ఆహారం రుచిని పెంచడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ సమస్యను సమతు...