Hyderabad, జనవరి 28 -- Chris Martin from Telangana: బ్రిటీష్ సింగర్, కోల్డ్‌ప్లే బ్యాండ్ ప్రధాన సభ్యుడు అయిన క్రిస్ మార్టిన్ తనది తెలంగాణ అని అందరికీ తెలుసు అంటూ జోక్ చేసిన వీడియో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం (జనవరి 28) స్టార్ హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. అహ్మదాబాద్ లో జరిగిన కోల్డ్‌ప్లే చివరి కాన్సర్ట్ లో క్రిస్ మార్టిన్ ఇండియాలోని సౌత్ స్టేట్స్ గురించి చెబుతూ.. తాను తెలంగాణకు చెందిన వాడినని జోక్ చేశాడు.

క్రిస్ మార్టిన్ అహ్మదాబాద్ కాన్సర్ట్ లో తన బ్యాండ్ సభ్యులను పరిచయం చేస్తూ తమదీ ఇండియన్ బ్యాండే అని, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్లమంటూ జోక్ చేశాడు. మీకు తెలియని విషయం ఏంటంటే.. మేం నలుగురు ఇండియాలోనే పుట్టాం.

కాబట్టి మాది ఇండియన్ బ్యాండ్.. బేసిస్ట్ గయ్ బెరీమ్యాన్ తమిళనాడుకు చెందిన వాడు.. అందరికీ తెలుసు నే...