Hyderabad, జనవరి 27 -- Chris Martin at Maha Kumbh: ఇండియాలో పలు కాన్సర్ట్‌ల కోసం వచ్చిన కోల్డ్‌ప్లే బ్యాండ్ కు చెందిన క్రిస్ మార్టిన్ సోమవారం (జనవరి 27) మహా కుంభమేళాకు వెళ్లాడు. అతనితోపాటు అతని గర్ల్‌ఫ్రెండ్ డకోటా జాన్సన్ కూడా ఉంది. ఆదివారం (జనవరి 26) రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి కాన్సర్ట్ చేసిన క్రిస్ మార్టిన్.. మరుసటి రోజే ఈ మెగా మేళాకు వెళ్లడం విశేషం.

మహా కుంభమేళా 2025 ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న విషయం తెలుసు కదా. దీనికి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. వీళ్లలో మన దేశానికి వచ్చిన ఓ స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నాడు. అతని పేరు క్రిస్ మార్టిన్.

కోల్డ్‌ప్లే బ్యాండ్ ప్రధాన సభ్యుడైన అతడు కూడా తన గర్ల్‌ఫ్రెండ్ డకోటా జాన్సన్ తో కలిసి సోమవారం ప్రయాగ్ రాజ్ వెళ్లాడు. ఈ ఇద్దరూ కుంభమేళాలో ఉన్న వీడియోను ప్రముఖ న్యూస్ ఏజెన్స...