భారతదేశం, ఫిబ్రవరి 10 -- Choutuppal Murder: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చినందుకు కొడుకుని విచక్షణ రహితంగా కొట్టడంతో బాలుడు ప్రాణాలు విడిచాడు. స్కూల్‌లో ఫేర్‌వెల్‌ పార్టీ జరిగిందని చెబుతున్నా వినకుండా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో జరిగింది.

స్కూల్‌ నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు మద్యం మత్తులో ఉన్న తండ్రి విచక్షణా రహితంగా కొడుకుని చితకబాదాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. హడావుడిగా అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమవగా ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

చౌటుప్పల్ మండలం ఆరేగూడేనికి చెందిన కట్ట సైదులు లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. సైదులుకు భార్య నాగమణి, ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరి మూడో ...