Hyderabad, ఫిబ్రవరి 18 -- అధిక కొలెస్ట్రాల్ అనేది అతి పెద్ద సమస్యగా మారిపోయింది. రక్తంలో ఎక్కువ కొవ్వుharitha పేరుకుపోవడం వల్ల ఈ అధిక కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది. ధమనులలో ఫలకాలు ఏర్పడి రక్త ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలో ధమనులను ఇరుకుగా చేస్తాయి. ఇవి గుండెకు రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తాయి. దీనివల్లే గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి అధిక కొలెస్ట్రాల్ శరీరంలో చేరితే ఆ విషయాన్ని తెలుసుకొని వెంటనే చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది.

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరితే వాటిని శరీరం కొన్ని లక్షణాల ద్వారా బయటికి తెలియజేస్తుంది. అందులో మొదటి సూచన చర్మంపై చిన్న గడ్డలు ఏర్పడడం. వాటిని కొవ్వు గడ్డలు అని కూడా పిలుచుకుంటారు. ఇవి కొవ్వు నిక్షేపాలు. చర్మం కింద ఉన్న కణజాలాలను ఇవి ప్రభావితం చేస్తాయి. ఈ గడ్డలు అ...