భారతదేశం, ఫిబ్రవరి 17 -- Chittoor Tragedy: చిత్తూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. పదో తరగతి విద్యార్ధినిని గుర్తు తెలియని వ్యక్తి గర్భవతిని చేశాడు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు గుట్టుగా ఉంచారు. నెలలు నిండటంతో పురిటి నొప్పులు వచ్చాయి. ఆడబిడ్డను ప్రసవించి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.

చిత్తూరు జిల్లా పలమనేరులో పదో తరగతి విద్యార్థిని గర్భం దాల్చి బిడ్డను ప్రసవించే సమయంలో ప్రాణాలు కోల్పోయింది. బాలికను గర్భవతిని చేసిందెవరో కూడా తల్లిదండ్రులకు తెలియక పోవడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుమార్తె విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు గుట్టుగా ఉంచారు. పరువు పోతుందని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టారు.

చిత్తూరు జిల్లా పలమనేరు మండలానికి చెందిన బాలిక(16) స్థానిక ప్రభుత్వ ...